తాళ్లపాయి గ్రామం వద్ద పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

తాళ్లపాయి గ్రామం వద్ద పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామంలోని పాములేరు వాగు వరద ఉధృతిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పాములేరు వాగులో వరద ఉధృతి కారణంగా తాళ్లపాయి గ్రామం నుంచి బూర్గంపాడు వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు ఈ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగి వరద ఉధృతి మరింత పెరిగితే స్థానిక ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా డీడీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Blogger ఆధారితం.