పెద్దమ్మతల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి గుడి)లో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. దేవాలయానికి పరిసర గ్రామాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
తమ కష్టాలను తీర్చమని వేడుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అన్నప్రాసనలు, వాహన పూజలు, తలనీలాలు, ఒడిబియ్యం, చీరలు, కుంకుమలు వంటి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భవాని దీక్షపరులు నిర్వహించిన ఇరుముడి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన క్యూ లైన్లు, ఉచిత పులిహోర ప్రసాదం, మంచినీటి వసతి వంటి ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ఆదేశాల మేరకు సిబ్బంది పర్యవేక్షించారు.

.webp)
Post a Comment